ఇతర దేశాల నుంచి ఏపీకి వచ్చేవారు క్వారంటైన్ లో ఉండాల్సిందే

ఏపీ రాష్ట్ర కోవిడ్ నోడల్ అధికారి శ్రీకాంత్

Those coming to AP from other countries
Those coming to AP from other countries

Amaravati: ఇతర దేశాల నుంచి ఏపీకి వచ్చేవాళ్లు తప్పనిసరిగా క్వారంటైన్ లో ఉండాల్సిందేనని ఏపీ రాష్ట్ర కోవిడ్ నోడల్ అధికారి శ్రీకాంత్ స్పష్టం  చేశారు.

ఇతర దేశాల నుంచి వచ్చే వారి కోెసం రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందన్నారు.

వారిని తీసుకువచ్చే విమానాలు హైదరాబాద్, చెన్నై, బేంగళూరు వస్తాయన్న ఆయన విశేశాల నుంచి ఏపీకి రావాలనుకున్న వారు  హైదరాబాద్, బెంగళూరు, చెన్నై విశాఖలకు నేరుగా వచ్చే అవకాశం ఉందన్నారు.

రాష్ట్రంలోని వచ్చే వారందరినీ ఆయా జిల్లాల కోవిండ్ కమాండ్ కంట్రోల్ కు తరలిస్తామనీ, అన్ని పరీక్షలూ అయిన తరువాత క్వారంటైన్ కు తరలిస్తామని పేర్కొన్నారు.

వీరి కోసం పెయిడ్, ఉచిత క్వారంటైన్ లను సిద్ధం  చేశామన్న ఆయన విదేశాల నుంచి వచ్చిన వారు దేనినైనా ఎంచుకోవచ్చన్నారు.

ఇప్పటి వరకూ విదేశాల నుంచి ఏపీకి రావడానికి 30 వేల మంది రిజిస్టర్ చేయించుకున్నట్లు వివరించారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం :https://www.vaartha.com/specials/health1/