ఢిల్లీ లో బీఆర్ఎస్ కు షాక్..పార్టీ ఫ్లెక్సీల తొలగింపు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..తాజాగా బిఆర్ఎస్ పార్టీని ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. రేపు ఢిల్లీ లో పార్టీ కార్యాలయాన్ని ప్రారభించబోతున్నారు. అంతకంటే ముందు ఈరోజు రాజశ్యామల యాగం ప్రారంభించారు. సీఎం కేసీఆర్‌కు యజ్ఞ యాగాలు చేయడం కొత్తేమీ కాదు..అందులోనూ రాజశ్యామల యాగం చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ ఆవిర్భవించడం..దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి సిద్దమవుతున్న నేపథ్యంలో యాగం చేస్తున్నారు. ఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీసు వద్ద ఈ యాగం చేస్తున్నారు. ఈ క్రమంలో బిఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు ఎన్డీఎంసీ (న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్) అధికారులు.

ఢిల్లీ లోని పలు చోట్ల బిఆర్ఎస్ ప్లెక్సీ లను ఏర్పాటు చేసారు పార్టీ శ్రేణులు. దేశ్ కీ నేతా కేసీఆర్ అంటూ ఫ్లెక్సీలపై ముద్రించారు. అయితే, ఈ ఫ్లెక్సీలను ఎన్డీఎంసీ (న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్) అధికారులు తొలగించారు. అనుమతి లేకుండానే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని, అందుకే వాటిని తొలగించామని అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉంటె బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాజశ్యామల యాగం ప్రారంభించారు కేసీఆర్. ముందుగా గణపతి పూజతో రాజశ్యామల యాగాన్ని మొదలు పెట్టడం జరిగిదని. పుణ్యహవాచనం, యాగశాల ప్రవేశం, చండీపారాయణం, మూలమంత్ర జపాలు నిర్వహించనున్నారు. రేపు (బుధవారం) నవ చండీహోమం, రాజశ్యామల హోమం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. శృంగేరిపీఠం గోపీకృష్ణశర్మ, ఫణి శశాంకశర్మ ఆధ్వర్యంలో హోమాలు జరగనున్నాయి.

ఇక ఈ యాగంతో దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ దశ మారుతుందని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. అలాగే యాగం జరిపించిన ప్రతిసారి కేసీఆర్‌కు విజయాలే వచ్చాయి. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఏర్పాడ్డాక యాగం చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ కూడా సక్సెస్ అవుతుందని నేతలు భావిస్తున్నారు.