సొంత నియోజకవర్గంలో చంద్రబాబు భారీ షాక్ : వైసీపీ లో చేరిన 100 టీడీపీ శ్రేణులు

tdp-chief-chandrababu

రాబోయే ఎన్నికల్లో గెలుపు టీడీపీదే అని చంద్రబాబు చెపుతుంటే..ఆయన సొంత నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్య లో వైస్సార్సీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. తాజాగా గుడిపల్లి మండలంలోని వంద మంది టీడీపీ కార్యకర్తలు సభ్యత్వ కార్డును ప్రదర్శించి వైస్సార్సీపీ పార్టీలో చేరారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సమక్షంలో వీరంతా వైస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. కుప్పం ఇన్చార్జి ఎమ్మెల్సీ భరత్ నాయకత్వంలో వీరు పార్టీ లో చేరారు.

ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మూడేళ్ల పరిపాలన చూశాకే కుప్పంలో కూడా వైస్సార్సీపీ జెండా ఎగరాలి అని స్థానికులు కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. వైస్సార్సీపీ పార్టీలో చేరిన వారికి తగిన ప్రాధాన్యం లభిస్తుందన్నారు. రానున్న రోజుల్లో కుప్పం నుండి మరిన్ని చేరికలు ఉంటాయని తెలిపారు. కుప్పంలో టీడీపీ ఖాళీ అవడం ఖాయమన్నారు మంత్రి పెద్దిరెడ్డి. 2024 ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ విజయం తధ్యమని అని ధీమా వ్యక్తం చేసారు.