టీమిండియా క్రికెట్‌లో బాస్‌ అని నిరూపించుకుంది

Shoaib Akhtar
Shoaib Akhtar

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ మూడో టీ20లో భారత్‌ విజయం సాధించిన తర్వాత తన యూట్యూబ్‌ ఛానల్లో స్పందించిన మాజీ బౌలర్‌ భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సేనను కొనియాడారు. బంగ్లాదేశ్‌ పై టీ20 సిరీస్‌ గెలిచి టీమిండియా క్రికెట్‌లో బాస్‌గా నిలిచిందని అన్నారు. కాగా తొలి టీ20లో ఓటమిపాలైనప్పటికీ తిరిగి పుంజుకొని సిరీస్‌లో పైచేయి సాధించిందని రోహిత్‌ శర్మ గొప్ప నైపుణ్యం గల ఆటగాడు ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు పరుగులు చేయగలరు అని మెచ్చుకున్నారు. ఇరు జట్ల మధ్య జరిగిన మూడో టీ20 బాగా జరిగింది. అయితే..టీమిండియా అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇంకా టీమిండియా యువ సంచలనం దీపక్‌ చాహర్‌పై స్పందిస్తూ..అతడి బౌలింగ్‌లో మీడియం పేస్‌, సీమ్‌ కలిసుందని చెప్పారు. చివర్లో హ్యాట్రిక్‌ సాధించి ప్రశంసనీయమైన ప్రదర్శన చేశారని షోయబ్‌ అక్తర్‌ ప్రశంసలు కురిపించాడు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/