మోడిని పవార్‌ కలిస్తే తప్పేంటి?

వారం రోజుల్లో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం

Sanjay Raut
Sanjay Raut

ముంబయి:ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోడితో భేటి కానున్నారు. ఈ విషయంపై శివసేన నేత సంజయ్ రౌత్ స్పందించారు. మోడిని పవార్ కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. మహారాష్ట్రలో రైతు సమస్యలను వివరించేందుకే ప్రధానితో పవార్ భేటీ కానున్నారని తెలిపారు. వీలైనంత ఎక్కువ నిధులు, కేంద్ర సాయం పొందేందుకే కృషి చేస్తామన్నారు. డిసెంబరు మొదటి వారంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందుకోసం వారం రోజుల్లో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. మరో రెండు రోజుల్లో పార్టీలకు అతీతంగా ప్రధాని మోడి వద్దకు వెళ్లి రైతుల సమస్యలపై చర్చిస్తామని సంజయ్ రౌత్ తెలిపారు. మోదీని శరద్ పవార్ కలవడంలో మరో ఉద్దేశం ఏదీ లేదని చెప్పారు. దేశం మొత్తానికి మోడి ప్రధాని అని అన్నారు. శరద్ పవార్ తో పాటు తమ పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే కూడా ఎల్లప్పుడూ రైతుల సమస్యల పరిష్కారం గురించే ఆలోచిస్తారని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/