నేడు గవర్నర్‌ను కలవనున్న శివసేన నేతలు

ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సిద్ధం?

shiv sena
shiv sena

మహారాష్ట్ర: మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలంటూ బిజెపి ముందు డిమాండ్ పెట్టిన శివసేన నేతలు ఈ రోజు సాయంత్రం గవర్నర్ భగత్ సింగ్ కోష్యారితో భేటీ కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని వారు కోరనున్నట్లు తెలిసింది. భగత్ సింగ్ తో శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ సహా ఆరుగురు నేతలు సమావేశం అవుతారు. వర్లి నుంచి పోటీ చేసి గెలిచిన ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బిజెపిని శివసేన డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ఈ డిమాండ్ కు బీజేపీ నేతలు ఒప్పుకోవట్లేదు. ఇటీవల శివసేన, బిజెపి నేతలు వేర్వేరుగా గవర్నర్ తో భేటీ అయ్యారు. కాగా, మహారాష్ట్రలో తమకు 170 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారని చెప్పారు. మరో ఐదుగురు కూడా తమకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని సంజయ్ రౌత్ నిన్న వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/