భారత్‌లోనూ బుర్ఖాలను నిషేధించండి!

shiv sena
shiv sena


ముంబై: శ్రీలంకలోనూ ,భారత్‌లోనూ బుర్ఖా ధారణను నిషేధించాలని శివసేన డిమాండ్‌ లేవనెత్తింది. ట్రిపుల్‌ తలాక్‌పై నిర్ణయం తీసుకున్నట్లుగానే బుర్ఖాలపై కూడా నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోదిని కోరింది. రావణుడు పుట్టిన లంకలోనే బుర్ఖాలు నిషేధించగా లేనిది రాముడు పుట్టిన దేశంలో చేస్తే తప్పేంటి అంటే ఘాటుగా ప్రశ్నించింది. ఈస్టర్‌ డే రోజున జరిగిన వరుస పేలుళ్ల దృష్ట్యా శ్రీలంక ప్రభుత్వం బుర్ఖాలను, స్కార్ఫ్‌లను నిషేధిస్తూ సంచలన నిరణయం తీసుకుంది. దీనిపై సామ్నా పత్రికలో స్పందించింది శివసేన. రాత్రికి రాత్రే శ్రీలంక అధ్యక్షుడు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారని, అది ఎంతో సాహసంతో కూడిన వ్యవహారమంటూ ప్రశంసల వర్షం కురిపించింది. ఇస్లాంను చాలా మంది సరిగ్గా అర్ధం చేసుకోవడం లేదని, వారి ఆచారాలు మరింత గందరగోళంగా మారాయని అన్నారు. వీటికి వ్యతిరేకంగా ఎవరైనా గళమెత్తితే..ఇస్లాం ప్రమాదంలో పడిందంటూ గోల చేస్తుంటారని విమర్శించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/