నేటి నుండి తెరుచుకోనున్న షిర్టీ సాయిబాబా ఆలయం

SAI BABA , SHIRDI
SAI BABA , SHIRDI

ముంబయి: షిర్టీ సాయిబాబా ఆలయం ఈరోజు నుండి భక్తుల కోసం తెరుచుకోనుంది. కరోనా మధ్య భక్తులు ఆలయాలను సందర్శించేందుకు ప్రభుత్వం స్టాండర్స్‌ ఆపరేటింగ్‌ ప్రోసీజర్స్‌ జారీ చేసింది. ఆలయాల్లో సామాజిక దూరం, ఫేస్‌ మాస్క్‌లు ధరించడం తప్పసరి సరి చేశారు. షిర్డీ దేవస్థానం ట్రస్ట్‌ నిత్యం ఆరువేల మందికిపైగా భక్తులకు మాత్రమే అనుమతి ఇస్తోంది. కౌంటర్లతో పాటు ఆన్‌లైన్‌లో టికెట్లు జారీ చేస్తున్నట్లు షిర్డీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ తెలిపింది. 65 ఏళ్లు పైబడిన, పదేళ్లలోపు చిన్నారులకు ప్రవేశానికి అనుమతి ఇవ్వడం లేదని స్పష్టం చేసింది.
కాగా, కరోనా వ్యాప్తి కారణంగా మార్చి 17వ తేదీ నుండి సాయిబాబు ఆలయంలో దర్శనాలు నిలిపివేసిన విషయం తెలిసిందే.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/