భౌతికం – ఆధ్యాత్మికం

షిర్డీ సాయి నాధుని లీలలు

Greatness of Shirdi sai
Greatness of Shirdi sai

లోకంలో జీవించే వ్యక్తులకు అనేక సంఘటనలు జరుగుతుంటాయి. ఆ సంఘటనలు అన్నీ భౌతిక పరమైనవే కానక్కరలేదు.

అవి భౌతిక లేదా లౌకిక పరంగా కన్పించినా ఆధ్యాత్మికభావంతోనిండి ఉంటుంది. సాయి సచ్చరితలో కొన్ని వందల సంఘటనలున్నాయి.

ఉదాహరణకు ఒక ధనికుడు, బండీని చాడుగకుతీసుకొని షిరిడీవచ్చాడు.

వచ్చీరావటంతోనే సాయిబాబాను బ్రహ్మజ్ఞానాన్ని బోధించుమని అడగసాగాడు. సాయి అతనిని చూచి విసుగుచెందలేదు. ఇంకా తూలనాడలేదు. ప్రశాం తంగా మాట్లాడి పంపివేశాడు.

బ్రహ్మజ్ఞానుము అంగడిలో దొరకే వస్తువు కాదని, ఎంతో కష్టపడాలని సాయి చెప్పారు. సాయి చెప్పిన ఆసూచనలన్నీ, ఎంతో ప్రధాన్యాన్ని సంతరించుకున్నాయి.

చూడటానికి అది లౌకిక పరమైనదే అనిపి స్తుంది. లోతుగా విచారిస్తే, విషయం బయటకువస్తుంది. అటువంటి సంఘటనలు ప్రతిమహనీయుని జీవి తంలో కనిపిస్తాయి.

కానీ అవి భౌతిక ముసుగును వేసుకుంటాయి. ఆ భౌతికముసుగును వేరు చేస్తేగాని, అంతర్గాంతగా బయట పడదు. అదిగురు గోవింద్‌సింగ్‌ శిక్కుల గురువుగా ఉన్న కాలంలో జరిగింది.

ఆయనకు బబ్బర్‌షేర్‌ సింగ్‌జీ అనే శిష్యుడు ఉన్నాడు. బబ్బర్‌సింగ్‌ గురుగోవింద్‌సింగ్‌ చెప్పిన మాటలను ఆచరణలో పెట్టేవాడు.

గురుగోవింద్‌సింగ్‌ నామానికి (నామస్మరణకు ) ప్రాధాన్యం ఇచ్చేవాడు.

బబ్బర్‌సింగ్‌ ఒకనాడు ప్రాతఃకాలంలో రోజూలాగే నిద్రలేచి, నామస్మరణ చేసుకుంటు వెళ్తున్నాడు. నామస్మరణలో పడిన వానికి బాహ్య ప్రపంచ స్మృతి ఉండదు.

సద్గురు నామాన్ని స్మరించుకుంటుపోతున్నాడు. ఎటుపోతు న్నాడో తెలియకుండా నడుస్తున్నాడు.

ఎకాఎకి మొగల్‌ సైన్య గుడారంలోకి వెళ్లాడు. కొంత సేపటికి బాహ్యస్మృతి వచ్చింది. చుట్టూ మొగలాయీ సైనికులున్నారు.

అయినా కలవరపడలేదు. ఆయన గూడ విరోచిత ఖడ్గంతోనే వున్నాడు.

‘కకార పంచకంలో సిక్కు తప్పనిసరిగా కత్తి లేక ఖడమను ధరించి ఉండాలి, మిగిలిన నాలుగు ‘కలతో పాటుగా. మొగల్‌ సైన్యాధీపతి ‘సిక్కుల ఖల్సా (సంఘం)ను గూర్చి గురువును గూర్చి చాలా విన్నాను.

నీ గురువు సత్తాను చూపు అన్నాడు. తనను ఏవైనా అంటే బబ్బర్‌సింగ్‌ పట్టించుకోడు కాని తన గురువును ఎవ్వరు పల్లెత్తుమాట అన కూడదు.

బబ్బర్‌సింగ్‌ అట్లాగే అన్నాడు. ‘ఇదినా ఖడ్గం, ఖడ్గం నీ వద్ద ఉన్నది. ఎవరి కత్తులలో పసెంతవుందో తెల్సుకుందాం.

నీవు గెలిస్తే, నీదారిననీవు పోవచ్చును అన్నాడు సైనికాధికారి. అసైనికాధికారి తనవద్దనున్న కత్తితోని గాలిలో ఆడిస్తూ, ఆ సిక్కు వీరుని సైనిక వేషాన్ని (బట్టలను) తొలగించాడు.

బబ్బరుసింగ్‌కు ఏ మాత్రమైన గాయం కలుగకుండా కొన్ని సైనిక దుస్తులను తొలగించాడు సునాయాసంగా. అక్కడున్న సిపాయిలందరూ చప్పట్లు కొట్టారు.

ఆ సైనికాధికారి రాఘవాన్ని చూసి ఇక బబ్బర్‌సింగ్‌ తన ఖడ్గాన్ని తీసిగాలో తిప్పసాగాడు తిప్పి ఆగిపోయాడు. సైనికులు బబ్బర్‌సింగ్‌ను నీవేమి చూపాలని ప్రశ్నించారు.

బబ్బర్‌ సింగ్‌ ఆసైనికాధిరిని తలను ఒక్కసారి త్రిప్పుకో మన్నాడు. ఆ సైనికాధికారి తనతలను ముట్టుకున్నాడో లేదో, తల మొండెము నుండి విడివడింది.

ఆ సైనికాధికారి ఆ చేష్టలోని అంతరార్థాని గ్రహించాడు. మొండెములైకి బంధాలకు సంకేతం. మనసుపాడేతల ఆధ్యాత్మికంపరంగా దైవచింతనకు వాడాలి.

తలను మొండెము నుండి వేరుచేసి చూపటంలో ధ్యాసను అంతా మనస్సుపైన అంటే ఆ మనస్సును దైవానికి ఆరాటపడేటట్లు చేసుకోవాలి భావం అని ఆ సైనికాధి గ్రహించడు.

అదే బబ్బర్‌సింగ్‌ గురువు గురుగోవింగ్‌ సింగ్‌ చెప్పేది.

ప్రతి మనస్సును దైవానికి అర్పించే క్షణంలో తలను, మొండెమును వేరు చేసిన, బబ్బర్‌సింగ్‌ ఆ సైనికాధికారికి దైవచింతన చేయమని తెలిపాడు. ప్రతిష్ట దైవార్పణ చేయాలి.

  • యం.పి.సాయినాథ్‌

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/