అర్థసత్యం

షిర్డీసాయి లీలలు

Shirdi Sai Baba

సాయిబాబాను ఎందరెందరో సందర్కించేవారు. వారిలో ఒకరు విజయానందుడు. ఇతడు సన్యాసాశ్రమాన్ని చపట్టాడు. సాయిబాబా కీర్తివిని దర్శించటానికి వచ్చాడు.

అతడుసన్యాసాశ్రమం స్వీకరించినా, అతని కుటుబంలోని వారికి ఆతడెక్కడున్నది తెలిసే ఏర్పాట్లు జరిగాయి.

విజయానందుడు ఒక రోజున సాయిబాబా వద్దకు వచ్చి, నా తల్ల మరణశయ్యపై నున్నది.

నేను ఆమెను వద్దకు వచ్చి, నా తల్లిని అంతప్రేమించువాడవయితే, సన్యాసయెందుకు పుచ్చుకుంటోవి? కాషాయ వస్త్రములు ధరించువానికి దేనియందు అభిమానముచూపుట తగదు. ‘ అని పలుకు తాడుసాయి.

తాత్కాలిక వైరాగ్యలతో సన్యసించాల నుకొని సన్యసంచటం, సంసారాన్ని వదిలివేయ టం తగదు అని సాయి చెప్పాడు. సిక్కుల మొదటి గురువు గురు నానక్‌. సాయిబాబా చెప్పిన విషయాన్నే ఆయన జీవిత చరిత్రలో చూడ వచ్చును.

నానక్‌సాయి బాబా 3,4 వందల ఏండ్ల క్రితము వాడు. గురునానక్‌ తన శిష్యుడయిన భా§్‌ువర్దానాతో దేశవిదేశ పర్యటన చేశాడు.

ఆ సందర్భంలో సియాల్‌ కోటకు వారు చేరారు. ‘సియార్‌కోట ఊరిలో బసచేయవచ్చును కదా.

ఆ చెట్టు కింద ఎందుకు అని భా§్‌ుమర్దానా నానక్‌ను అడిగాడు ‘ ఆ ఊరిలో అసత్యం బాగా ఉన్నది. అట్టి అసత్యపేరితగాలిని పీల్చటం కష్టం అన్నాడు నానక్‌.

మీరయితే గాలిపీలుస్తుఉండగలరు కానీ, నేను మాత్రం గాలితో కడుపు నింపుకోలేను. కడుపులో తిండిపడాలి అన్నాడు మర్దానా.

‘సరే ఊరిలోనికిపో అందరినీ ఇలా అడుగు- నీగురువుకు అర్ధణాసత్యం, అర్థణా అసత్యం కావాలని.

దీనికి జవాబు చెప్పినవాడు భోజనం పెడతాడు అన్నాడు నానఖ్‌ మర్దానాతో. మర్దానా ఎందరివద్దకోపోయాడు.

మర్దానాను అందరూ గెలిచేసేవారే. చివరగా ఒక దుకాణం కనపడ్డది. ఆరుకొణాదారుడు శాంతంగా విన్నాడు.

ఇంటికి తీసుకువెళ్లి కడుపునిండా భోజనం పెట్టాం చాడాదుకాణాదారుడు, ఆ దుకాణాదారుని పేరు మూలా, అందరూ ఆతనని భా§్‌ుమూలం అందురు.

భోజనం పూర్తి అయిన తర్వాత భాయ్మూలా, భాయ్ మర్దానాతో ‘జీవితం అసత్యం.

మరణమే సత్యల అని చెప్పు అన్నాడు. భాయ్ మర్దానా తిరిగివెళ్లిపోవటానికి లేచాడు. ‘మీ గురువు ఎవరో నేను చూస్తాను అంటూ భాయ్ మూలా కూడా భాయ్ మర్దానావెంట వెళ్లాడు.

గురునానక్‌ను చూచాడు. ఆయనదివ్వాకృతి భా§్‌ుమూలంలో శాంతిని నింపింది. ‘ నేను ఈ ప్రపంచాన్ని వదిలేస్తాన. మీ వెంటవస్తాను ‘అన్నాడు మూలా డైవాన్వేషణ చేయాలంటే సన్యసించనక్క రలేదు.

సంసారిగా ఉంటూ దైవాన్వేషణ చేయవచ్చుననే నేను తెల్పటానికి బయలు దేరాను ‘అనినానక్‌ ప్రార్థన ఎలా చేయాలో చెప్పి భాయ్ మూలంను ఇంటికి పంపివేశాడు.

నానక్‌, మర్దానా మరికొంతకాలం అనేక ప్రదేశాలు తిరిగి మరసియాల్‌ కోటకు వచ్చారు. భా§్‌ుమర్దానా భా§్‌ుమూలం ఎలున్నాదో చూచివస్తానని నానక్‌తో చెప్పిభాయ్ మూలం ఇంటికి బయలు దేరాడు.

భాయ్ మర్దానా రావటాన్ని భాయ్ మూలా భార్య చూచింది. భాయ్ మూలా భార్య భర్తతో ‘నీవు వాళ్లతో పోయావంటే,చలికి, ఎండకు తట్టుకోలేవు. ఆకలికి ఓర్చుకోలేవు.

వాళ్లవెంటపోతే నీ ప్రాణాన్ని నీవే తీసుకున్నట్ల వుతుంది అన్నది. భాయ్ మూలా ఇల్లువదలన న్నాడు.

ఒక గదిలో దాక్కున్నాడు. భాయ్ మర్దానా వచ్చాడు. భర్త ఎక్కడికో వెళ్కాడని చెప్పింది. భా§్‌ు మర్దానా తిరిగి నానక్‌ వద్దకు వెళ్లి ఈ విషయాన్నే చెప్పాడు.

నానక్‌ ‘మరణంసత్యం. జీవితం అసత్యం అన్నాడు. ురణించాడు. అతతడు చెపిపనట్లుగానే జీవితం అసత్యమయింది. మరణాల సత్యమయింది. ఉద్రేకంతో సన్యసించటం కాషాయానికి కళలకల తెచ్చినట్లే.

  • యం.పి.సాయినాథ్‌

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/