మెరిసే పంటి తీరు

దంత సంరక్షణ

Dental care
Dental care

పళ్లు తెల్లగా మారేందుకు పసుపులో నీరుపేస్ట్‌లా చేసి బ్రష్‌తో మృదువుగా పళ్లపై తోమాలి. బ్రష్‌ చేశాక అయిదు నిమిషాలు అలా వదిలేయాలి.

తరువాత చల్లని నీటితో పుక్కిలించి, మాములుగా టూత్‌పేస్టుతో తోముకోవాలి. నాలుగు టేబుల్‌ స్పూన్ల పసుపులో రెండు టీ స్పూన్ల బేకింగ్‌ సోడా, మూడు టేబుల్‌ స్పూన్ల కోకోనట్‌ ఆయిల్‌ కలపాలి.

ఈ మిశ్రమంలో బ్రష్‌ ముంచి రెండు నిమిషాలు పళ్లపై మృదువుగా తోమాలి.

తరువాత కొబ్బరినూనెలు నోట్లో వేసుకుని ఒక నిమిషం పాటు పుక్కిలించాలి.

ఇప్పుడు మౌత్‌వాష్‌ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయాలి.

పసుపు కొమ్ముని వేయించి పొడి చేసి అందులో నిమ్మరసం, ఉప్పు కలిపి, ఈ పేస్ట్‌ని పళ్ల మీద అప్లై చేఇ ఆ తరువాత మౌత్‌వాష్‌ చేసుకోవాలి.

అరగ్లాసు మంచినీటిలో అర టీ స్పూన్‌ పసుపు వేసి పుక్కిలించి ఉమ్మేయాలి. ఆ తరువాత నీటితో మౌత్‌వాష్‌ చేసుకోవాలి. ఇలా రోజు చేయవచ్చు.

పచ్చి పసుపుకొమ్ము చిన్న ముక్కని అయిదు నిమిషాలు నమిలినా మంచిదే.

అర టీ స్పూన్‌ పసుపులో వెనిల్లా ఎసెన్స్‌ వేసి బ్రష్‌ చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే చాలు. పసుపులో టీస్పూన్‌ ఆవనూనె, చిటికెడు ఉప్పు కలిపి పళ్లు తోముకోవాలి.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/