అధిక వడ్డీ ఇస్తామని చెప్పి సినీ హీరోలను మోసం చేసిన కిలాడీ లేడి అరెస్ట్ ..

అధిక వడ్డీ ఆశ చూపి సినీ ప్రముఖులను , వ్యాపారస్తులను మోసం చేసిన కిలాడీ లేడీ శిల్ప ను పోలీసులు అరెస్ట్ చేసారు. శిల్పా అనే మహిళ అధిక వడ్డీల పేరుతో బడా బాబులకు వల వేసింది. ఆమె మాటలు నమ్మిన చాలామంది పెద్దలు నిండా మునిగిపోయారు. బాధితుల్లో పలువురు సినిమా తారలు కూడా ఉన్నారంటేనే..ఆ కిలాడీ లేడి ఏ రేంజ్ లో వారిని ఆకర్షించిందో అర్ధం చేసుకోవచ్చు. ఒకటి రెండు కాదు దాదాపు 200 కోట్లు రాబట్టినట్లు తెలుస్తుంది.
శిల్పా చౌదరితో పాటు ఆమె భర్తను అరెస్ట్ చేశారు. ఈమెకు పలు చీటింగ్ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. శిల్పా చౌదరి బాధితుల్లో నటులు మాత్రమే కాదు బ్యూరోక్రాట్‌లతో సహా ఉన్నత స్థాయి వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. చివరకు తిరిగి డబ్బులు ఇవ్వకపోవడంతో ఆమె చేస్తోన్న మోసాలను గుర్తించిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈమె అసలు రంగు బయటపడింది. శిల్ప అరెస్ట్ వార్త తెలుసుకొని మోస పోయిన బాధితులంతా పోలీస్ స్టేషన్ కు క్యూ కడుతున్నారు. మరి ఆ డబ్బంతా ఈమె ఏంచేసిందనేది తెలియాల్సి ఉంది.