చిన్నపిల్లలతో చిందులేసిన శిఖర్‌ ధావన్‌

Shikhar Dhawan
Shikhar Dhawan

ఢిల్లీ: భారత ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ చిన్నపిల్లలతో కలిసి డాన్స్‌ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోను గబ్బర్‌ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. పిల్లలందరూ కలిసి ధావన్‌తో కలిసి స్టెప్పులేస్తూ, గబ్బర్‌ ఓ చిన్నారిని ఎత్తుకుని మరి డాన్స్‌ చేస్తున్నాడు. కాగా ఈ వీడియోకు శిఖర్‌ ధావన్‌ ఓ క్యాప్షన్‌ కూడా పెట్టాడు.’ప్రతి వ్యక్తిలోనూ ఒక చిన్నపిల్లాడు ఉంటాడు. ప్రపంచానికి ఆనందాన్ని పంచడానికి నేను ఎంతో ఇష్టపడతా. చిన్నారులు వాళ్ల స్వచ్ఛమైన మనస్సుతో డ్యాన్స్‌ చేయడాన్ని ఎంతో ఆస్వాదించా. చాలా ఆనందంగా ఉంది’ అని గబ్బర్ పోస్ట్‌ చేశాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన 20 నిమిషాల్లోనే 20,000 మంది చూశారు. అభిమానులు వీడియోపై లైక్‌లు, కామెంట్లు చేస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/