అధ్యక్ష ఎన్నికలు నిర్వహించకతప్పదు

‘సీడబ్ల్యూసీ’కి శశిథరూర్ సూచన

shashi-tharoor
shashi-tharoor

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి శశిథరూర్‌ తమ పార్టీ కార్యకర్తల్లో జోష్‌ నింపాలంటే అధ్యక్ష ఎన్నికలు నిర్వహించకతప్పదని అభిప్రాయపడ్డారు. కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయడంలో పార్టీలోని సీనియర్ నేతలు విఫలమయ్యారన్న మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ వ్యాఖ్యలను సమర్థించిన శశిథరూర్.. ఈ విషయాన్ని ఆయన నిబ్బరంగా చెప్పారన్నారు. దేశవ్యాప్తంగా పార్టీ నేతలందరూ ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కార్యకర్తల్లో కొత్త శక్తి నింపాలంటే సీడబ్ల్యూసీ వెంటనే అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/