కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌ను పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించాలిః కాంగ్రెస్ ఎంపీలు

Shashi Tharoor, 4 Other MPs Seek Transparency In Congress President Poll

న్యూఢిల్లీః కాంగ్రెస్ పార్టీకి అక్టోబ‌ర్ 17వ తేదీన అధ్య‌క్ష ఎన్నిక నిర్వ‌హించ‌నున్న విష‌యం విధితమే. అయితే ఆ ఎన్నిక‌ను పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించాల‌ని ఏఐసీసీ ఎన్నిక‌ల చీఫ్ మ‌ధుసూద‌న్ మిస్త్రీని కాంగ్రెస్ ఎంపీలు కోరారు. ఎంపీలు శ‌శిథ‌రూర్‌, కార్తి చిదంబ‌రం, ప్ర‌ద్యూత్ బోర్డోలై, అబ్దుల్ ఖ‌లీక్‌లు సంయుక్తంగా లేఖ‌ను రాశారు. ఎల‌క్టోర‌ల్ బాండ్లకు చెందిన అంశంపై త‌ప్పుడు స‌మాచారం వెళ్ల‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ఆ ఎంపీలు పేర్కొన్నారు. పార్టీ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పాల్గొనే ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ ప్ర‌తినిధుల‌తో కూడిన ఎల‌క్టోర‌ల్ కాలేజీని రిలీజ్ చేయాల‌ని ఎంపీలు త‌మ లేఖ‌లో డిమాండ్ చేశారు.

తాజా అంతర్జాతీ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/