మరోసారి సిల్వర్ స్క్రీన్ షేర్

Sharukh
Sharukh, Kajol

బాలీవుడ్ లో `దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే` చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలిసిందే. ముంబైలోని మరాఠా మందిర్ లో ఆ సినిమా ఏకంగా 20 ఏళ్లపాటు ప్రదర్శించారు. ఆ సినిమాలో లీడ్ రోల్స్ పోషించిన షారుక్ ఖాన్ – కాజోల్ ల జోడీ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. బాలీవుడ్ లోని హిట్ లవ్ పెయిర్ లో ఒకరైన షారుక్-కాజల్ లు ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించారు. అయితే కాజల్ కు పెళ్లయిన తర్వాత వీరిద్దరి కాంబోలో మై నేమ్ ఈజ్ ఖాన్ – దిల్ వాలే వంటి బ్లాక్ బస్టర్ హిట్ లు వచ్చాయి. అయితే తాజాగా ఈ హిట్ పెయిర్ మరోసారి సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కబోతున్నట్లు పుకార్లు వస్తున్నాయి.

షారూక్-కాజోల్ ల కాంబోలో మూడేళ్ల క్రితం విడుదలైన `దిల్ వాలే` హిట్ అయింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో మరో చిత్రం రాలేదు. అయితే తాజాగా ఓ హాలీవుడ్ మూవీ రీమేక్ లో ఈ హిట్ పెయిర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. కరణ్ జొహర్ ఆ సినిమాను రీమేక్ చేయబోతున్నారట. అయితే ఈ చిత్రం పట్టాలెక్కాలంటే ….కాజోల్ కరణ్ లు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి ఉందట. గతంలో కాజోల్-కరణ్ ల మధ్య చెలరేగిన వివాదం నేపథ్యంలో ఈ ఇద్దరు కలిసి పనిచేస్తారా…లేదా…అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.