హ్యాట్సాఫ్ చిన్నదొరా..అంటూ కేటీఆర్ ఫై షర్మిల ట్వీట్

YSRTP అధినేత్రి షర్మిల..మంత్రి కేటీఆర్ ఫై సోషల్ మీడియా వేదికగా హ్యాట్సాఫ్ చిన్నదొరా అంటూ సెటైరికల్ ట్వీట్ చేసారు. రైతు బీమాకు రూ.1,450 కోట్లు ఎల్‌ఐసీకి ప్రభుత్వం చెల్లించింది. దాంతో రైతులందరికీ ఇన్సూరెన్స్ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం కావడం, ఎంతో గర్వంగా ఉందంటూ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని 34 లక్షల రైతు కుటుంబాలకు ఈ ఏడాది ప్రీమియం చెల్లించడం ఎంతో గర్వంగా ఉందంటూ కేటీఆర్ సంతోషంగా ట్వీట్ చేశారు. కేటీఆర్ చేసిన ట్వీట్‌ స్క్రీన్ షాట్‌తో షర్మిల ఈరోజు మీ గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్ చిన్న దొర అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేశారు.

రాష్ట్రంలో కౌలు రైతులను అసలు రైతులే కాదని, కేవలం 37 లక్షల మంది రైతులకు మాత్రమే రైతు బీమా కట్టి.. మిగతా 30 లక్షల మంది రైతులను మరిచి జబ్బలు చరుచుకొంటున్నారు అని విమర్శించారు. రైతులకు బీమా ఇస్తున్నామని కళ్లు ఆర్పకుండా అబద్ధాలు చెప్తూ.. పట్టపగలే రైతులను నిలువునా మోసం చేస్తున్న మీ గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్ చిన్న దొరా అంటూ ఎద్దేవా చేశారు.

“18 లక్షల మంది కౌలు రైతులను అసలు రైతులే కాదని.. 67 లక్షల మందికి రైతుబంధు ఇస్తూ.. 37 లక్షల రైతులకు మాత్రమే రైతు బీమా కట్టి.. మిగతా 30 లక్షల మంది రైతులు చచ్చినా పర్వాలేదని.. వాళ్లు రైతు బీమాకు పనికి రారని.. ఆ రైతులు మరణిస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వారిని ఆగం చేస్తూ.. రైతులను ఆదుకుంది మేమే అని జబ్బలు చరుచుకొంటూ.. రైతులు అందరికీ బీమా ఇస్తున్నామని కండ్లు ఆర్పకుండా అబద్ధాలు చెబుతూ, పట్టపగలే రైతులను నిలువునా మోసం చేస్తూ .. మేము పెద్ద రైతులమని చెప్పుకు తిరుగుతున్న .. మీ గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్ చిన్న దొర..” అంటూ షర్మిల పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.