వైఎస్ షర్మిల హెల్త్ బులెటిన్ విడుదల

YSRTP అధినేత్రి వైస్ షర్మిల హెల్త్ బులెటిన్ ను అపోలో హాస్పటల్ వర్గం విడుదల చేసారు. పాదయాత్ర పోలీసులు అడ్డుకోవడం తో షర్మిల తన ఇంటివద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా ఆమె ఆరోగ్యం క్షిణిస్తుండడంతో పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేసి హాస్పటల్ కు తరలించారు. ఆమెకు చికిత్స అందజేస్తోన్న అపోలో ఆసుపత్రి డాక్టర్లు ఈ మేరకు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. ఇందులో కీలక అంశాలను పొందుపరిచారు. మంచినీళ్లు కూడా ముట్టకుండా దీక్షను కొనసాగించడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తాయని డాక్టర్లు తెలిపారు.

అర్ధరాత్రి ఒంటిగంటకు షర్మిల హాస్పటల్ లో అడ్మిట్ అయ్యారని పేర్కొన్నారు. అప్పటికే ఆమె లో-బ్లడ్ ప్రెషర్, నీరసం, బలహీనంగా ఉన్నారని చెప్పారు. మంచినీళ్లు గానీ ఇతర ద్రవ పదార్థాలను గానీ తీసుకోకపోవడం వల్ల డీహైడ్రేషన్‌కు గురయ్యారని వివరించారు. ఆర్థోస్టేటిక్ హైపోటెన్షన్‌తో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఆమె శరీరంలో పెద్ద మొత్తంలో ఒలిగ్యురియాను గుర్తించినట్లు డాక్టర్లు ఈ హెల్త్ బులెటిన్‌లో పొందుపరిచారు. అలాగే- మెటబాలిక్ యాసిడోసిస్, ప్రీ-రీనల్ అజొటోమియా సమస్యలు తలెత్తినట్లు చెప్పారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటోన్నారని, ఆమె శరీరం వైద్యానికి స్పందిస్తోందని డాక్టర్లు తెలిపారు. ఈరోజు లేదా రేపు ఉదయం డిశ్చార్జ్ చేస్తామని స్పష్టం చేశారు.