ఖమ్మం బహిరంగ సభలో పువ్వాడ ఫై నిప్పులు చెరిగిన షర్మిల

ఖమ్మం బస్టాండ్ సర్కిల్ వద్ద ఏర్పటు చేసిన భారీ బహిరంగ సభ లో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ..మంత్రి పువ్వాడ ఫై నిప్పులు చెరిగారు. పువ్వాడ కు ఎన్ని ఆస్తులు సంపాదించినా…ఎన్ని కబ్జాలు చేసినా…దనదాహం మాత్రం తీరదంటూ ఆమె అగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు గురువారం ఖమ్మం నియోజక వర్గం దంసలాపురం క్యాంప్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఖమ్మం టౌన్ పరిధిలోని కొత్తూరు, ముస్తఫానగర్, శాంతి నగర్, తుమ్మలగడ్డ, జెడ్పీ సెంటర్, పాత బస్టాండ్ సర్కిల్, చర్చి కాంపౌండ్ సెంటర్ మీదుగా పాదయాత్ర సాగింది.

ఖమ్మం టౌన్ ముస్తఫానగర్‌కు వైఎస్ షర్మిల చేరుకోగాా.. అక్కడ ఓ అభిమాని కోరిక మేరకు ఆటో నడిపారు. సాయంత్రం 5 గంటలకు పాత బస్టాండ్ సర్కిల్ వద్ద భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఆమె మరోసారి కేసీఆర్ పాలనా ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాగే మంత్రి పువ్వాడ ఫై ఓ రేంజ్ లో విమర్శలు చేసారు. ఖమ్మంలో పువ్వాడ నియంత పాలన జరుగుతుందని, ఉత్తి పుణ్యానికి మంత్రి కూడా అయ్యాడంటూ సెటైర్లు వేశారు. మంత్రి అయ్యాక… ఆ పదవికి విలువ లేదు, హోదా తెలియదు, హుందా కూడా తెలియదంటూ ఆమె మండిపడ్డారు. పువ్వాడ కు ఎన్ని ఆస్తులు సంపాదించినా…ఎన్ని కబ్జాలు చేసినా…దనదాహం మాత్రం తీరదంటూ ఆమె అగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ఆస్తులు ..ప్రైవేట్ ఆస్తులు అన్ని కబ్జా చేస్తాడని, కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అనేది పువ్వాడ కు సరిపోతుందంటూ ఆమె ధ్వజమెత్తారు. ఒకప్పుడు ఇల్లు లేని పువ్వాడకు హైదరాబాద్ శామీర్ పేట లో 80 ఎకరాల భూమి ఎలా వచ్చిందని, ఖమ్మంలో ఏ కాంట్రాక్ట్ చేసినా ఇతనే చేయాలని, ఆయన భార్య కంపెనీ..లేదా బినామీ కంపెనీ లే చేయాలన్నారు. ఈయన ట్రాన్స్ పోర్ట్ మంత్రి.. ఆర్టీసీ పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుందని ఆమె ఎద్దేవా చేశారు. ఆర్టీసీ కార్మికుల బ్రతులను రోడ్ల పాలు చేశారని, కనీసం యూనియన్స్ లేకుండా చేశారని ఆమె మండిపడ్డారు.