కేటీఆర్ ఫై షర్మిల విమర్శలు ..

sharmila counter to ktr
sharmila counter to ktr

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఫై వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శలు చేసారు. మ‌న‌మే స‌రిగ్గా లేన‌ప్పుడు ప‌క్క వారి మీద ప‌డి ఏడిస్తే ఏం లాభమన్నారు. ఇక్కడ ప్రజలు ఏం సంతోషంగా ఉన్నారని మీరు దేశాలను ఏలబోతున్నారంటూ ప్రశ్నించారు. ఇక్కడ ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. ముందు వీరికి సమాధానం చెప్పాలని అన్నారు.

తెలంగాణలో ఫ్రెండ్స్ ఉంటే ప్రజల సమస్యలు తెలిసేవని ఆమె అన్నారు. ఆంధ్ర‌లోనే చిన్న దొర కేటీఆర్‌కు ఫ్రెండ్స్ ఉన్నార‌ట అని ఆమె ఎద్దేవా చేశారు. తెలంగాణ‌లో కేటీఆర్‌కి ఫ్రెండ్స్ లేరని ఆమె అన్నారు. పక్క రాష్ట్రంపై దుమ్మెత్తిపోసే ముందు మన రాష్ట్రం ఎలా ఉందో చూసుకోవాలని ఆమె అన్నారు. తెలంగాణ ప్ర‌జ‌లు ఏం సంతోషంగా ఉన్నార‌ని ఆమె నిల‌దీశారు. తెలంగాణ‌లోనే ప‌రిస్థితులు బాగోలేక‌పోతే ఇప్పుడు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ దేశాన్ని ఏల‌తామ‌ని చెప్పుకుంటున్నార‌ని ఆమె విమర్శించారు.