మునుగోడు ఉప ఎన్నికలను ప్రజలంతా బైకాట్ చేయాలని షర్మిల పిలుపు

YSRTP అధినేత్రి వైస్ షర్మిల..మునుగోడు ఉప ఎన్నికను బైకాట్ చేయాలనీ పిలుపునిచ్చారు. మునుగోడు ఉపఎన్నిక అహకారం, అధికారమదం కోసం వచ్చిన ఎన్నిక అని , ప్రజల కోసం ఏనాడూ రాని నాయకులు.. ఓట్ల కోసం వస్తున్నారని , ప్రజలంతా ఈ ఎన్నికను బహిష్కరించాలని షర్మిల కోరారు. సమస్యలను పట్టించుకోని పాలకపక్షం,స్వార్థం కోసం అమ్ముడుపోయిన ప్రతిపక్షాలు ఉన్నన్ని రోజులు అభివృద్ధి జరగదు. ఎల్లవేళలా ప్రజలపక్షాన నిలబడేది YSRTP మాత్రమేనన్నారు షర్మిల.
రీసెంట్ గా ఈమె ఢిల్లీకి వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)కు ఫిర్యాదు చేశారు. కాగ్ ఛైర్మన్ గిరీశ్ చంద్ర ముర్మును కలిసి స్వయంగా షర్మిల ఫిర్యాదు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్షల కోట్ల అవినీతి జరిగిందంటూ కాగ్ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలు ఆధారాలను కూడా కాగ్‌కు షర్మిల సమర్పించినట్లు తెలుస్తోంది. ఒకే వ్యక్తికి కాంట్రాక్ట్ కేటాయించిన అంశంపై కాగ్‌కు వివరాలు అందించినట్లు తెలుస్తోంది.