దున్నపోతు మీద వాన పడ్డట్టు కేసీఆర్ తీరు : షర్మిల ఎద్దేవా

72 గంటల దీక్ష విరమణ

YS Sharmila
YS Sharmila

Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ ఉద్యోగాల పోస్టుల భర్తీ కోరుతూ చేపట్టిన 72 గంటల దీక్షను వైఎస్ షర్మిల విరమించారు. దీక్షా శిబిరంలో షర్మిల మాట్లాడుతూ.. ‘‘ప్రైవేట్ జాబులు కూడా రావడం లేదని ఆత్మహత్య చేసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం పైసా సహాయం చేయలేదు. గజ్వేల్ కాబట్టి సహాయం రాలేదు. రవీంద్ర నాయక్ పిల్లలను చూస్తే ఏ ఒకరికైనా కన్నీరు రాకుండా ఉంటుందా అంటూ షర్మిల తీవ్ర ఉద్వేగంటో అన్నారు.

రవీంద్ర నాయక్ భార్య, కొడుకు చేతుల మీదుగా షర్మిల దీక్ష విరమించారు. నిరుద్యోగ అమరుల కుటుంబ సభ్యులను షర్మిల ఓదార్చారు. రవీంద్ర నాయక్ భార్య, కొప్పు రాజు తల్లి, మురళీ ముదిరాజు తల్లికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు.

పోలీసుల భుజాల మీద గన్ను పెట్టిన మమ్మల్ని టార్గెట్ చేశారు. పాలకులకు ఎందుకంత భయం? మా పిర్యాదు కూడా తీసుకోలేని స్థితిలో పోలీసున్నారు. ఆడోళ్ళ మీదా మీ ప్రతాపం. పాలకులకు, పోలీసులకు సిగ్గుందాలి. పాలకుల అహంకారంపై మహిళ లోకం ఉమ్మేస్తోంది. తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్ పై పోలీసులు మా చీరలు లాగారు, నా చేయి విరిచారు, ఒక తమ్ముడి కాలు విరగగొట్టారు. 3లక్షల85 వేల ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లేదు’’ అని ప్రశ్నించారు.

వైఎస్ఆర్ బిడ్డగా చెప్తున్నా, నోటిఫికేషన్లు వచ్చే వరకు ప్రతి జిల్లాలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతాయి అని అన్నారు.
దున్నపోతు మీద వాన పడ్డట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ మెడలు వంచైనా ఉద్యోగాలు భర్తీ చేయిస్తా.. అని అన్నారు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం:https://www.vaartha.com/andhra-pradesh/