ఏపీలో షర్మిల పార్టీ పెట్టబోతోందా..? దీనికి ఆమె సమాధానం ఏంటో తెలుసా..?

ఇప్పటికే తెలంగాణాలో వైఎస్సార్‌టీపీ పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల..ఏపీలో కూడా పార్టీ పెట్టబోతోందా…దీనికి ఆమె క్లారిటీ ఇచ్చారు. జగన్ అన్న వదిలిన బాణంగా వైసీపీ తరపున ప్రచారం చేసిన వైఎస్ షర్మిల..ప్రస్తుతం ఆ అన్నకు దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో తెలంగాణ లో పార్టీ ఏర్పటు చేసిన షర్మిల..ప్రస్తుతం ఆవేదన యాత్ర, భరోసా యాత్రలతో తెలంగాణ ప్రజలకు చేరువ అయ్యే ప్రయత్నం చేస్తూవస్తునాన్రు. అయితే ఆమె పొలిటికల్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి అన్న జగన్ చెల్లి షర్మిల ఎదురెదురుగా మాట్లాడుకున్న సందర్భం లేదు. దీంతో ఆమె ఏపీలోనూ పార్టీ పెడతారంటూ ప్రచారం ఊపందుకుంది. ఈ వార్తలపై తాజాగా ఆమె క్లారిటీ ఇచ్చారు.

రాజకీయ పార్టీ ఎప్పుడైనా పెట్టవచ్చు… పెట్టకూడదనే రూల్ ఏమీ లేదుకదా? అని వ్యాఖ్యనించారు. ప్రస్తుతం తాను ఒక మార్గాన్ని ఎంచుకున్నాను అని.. అందులో నడుస్తున్నాను అంటూ.. భవిష్యత్తు పై పార్టీ పెట్టే యోచన వుందని పరోక్ష సంకేతాలు అందించారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ కానున్నాయి. ఆమె నిజంగా పార్టీ పెడితే అది అధికార పార్టీకి పెద్ద మైనస్ అయ్యే ప్రమాదం ఉది. వైఎస్ కుటుంబంలో చాలామంది జగన్ కు దూరమయ్యే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా వైఎస్ విజయమ్మ ఎటు ఉంటారు అన్నది ప్రశ్నార్థకంగా మారుతుంది.

ఇక తెలంగాణ లో ఈనెల 19 లేదా 20 నుంచి పాదయాత్రకు సన్నాహాలు చేస్తున్నట్లు షర్మిల అన్నారు. రైతు ఆవేదన యాత్రకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారని, కరోనా నిబంధనలు పాటిస్తామంటున్నా అనుమతి ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రం నిబంధనలు అడ్డురావా? అన్ని ప్రశ్నించారు. నిబంధనల వంకతో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని షర్మిల మండిపడ్డారు.