బిగ్ బాస్ 5 : కెప్టెన్ అవ్వగానే సిరికి భారీ షాక్ ఇచ్చిన షణ్ముఖ్..

నార్త్ లోనే కాదు సౌత్ లోను సక్సెస్ ఫుల్ గా బిగ్ బాస్ షో రన్ అవుతుంది. తెలుగు లో ఈ మధ్యనే సీజన్ 5 మొదలై 50 రోజులు పూర్తి చేసుకుంది. గతంలో కంటే కొత్తగా ఈసారి బిగ్ బాస్ టాస్క్ లు ప్లాన్ చేసారు. కెప్టెన్సీ టాస్క్‌ లో భాగంగా హౌస్ లో ‘వెంటాడు- వేటాడు’ అనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా థర్మాకోల్‌ బ్యాగులు ధరించిన పోటీదారులు సర్కిల్‌ గీసి ఉన్న ట్రాక్‌పై నడవాల్సి ఉంటుంది. గేమ్‌ ముగిసేసరికి ఎవరి బ్యాగులో ఎక్కువ థర్మాకోల్‌ ఉంటే వారే గెలిచినట్లు లెక్క. ఈ గేమ్ లో షణ్ముఖ్ విజయం సాధించి ఈ వారం బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ అయ్యాడు.

కెప్టెన్ అయిన అనంత‌రం .. ష‌న్ను సంచ‌ల‌న నిర్ణ‌యాలుతీసుకున్నారు. షణ్ముఖ్ జస్వంత్ కెప్టెన్ అయిన తర్వాత సిరి, జెస్సిలలో ఎవరో ఒకరు రేషన్ మేనేజర్ అవుతారని అంద‌రూ భావించారు. కానీఎవరూ ఊహించని విధంగా ఆనీ మాస్టర్‌ను రేషన్ మేనేజర్‌గా ఎంపిక చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య ప‌రిచాడు. ఈ నిర్ణ‌యంతో సిరి బాగా హర్ట్ అయింది. తనను కాకుండా మరొకరిని రేషన్ మేనేజర్‌గా తీసుకోవడంపై సిరి అలిగినట్లు తెలుస్తుంది. మొత్తం మీద షన్ను తనదైన ఆట ఆడుతూ వస్తున్నాడు.