బిగ్ బాస్ 5 : షణ్ముఖ్ చేసిన ఆ కామెంట్స్ ను తట్టుకోలేక వాష్‏రూంలోకి వెళ్లి గడియ పెట్టుకున్నసిరి..

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏంజరుగుతుందో ఎవరికీ తెలియదు..ప్రాణ స్నేహితులు ..బద్ద శత్రువులు అవుతారు..బద్ద శత్రువులు ప్రాణ స్నేహితులు అవుతారు. గొడవలు , అల్లర్లు , సరదాలు , చివాట్లు , ప్రేమలు , రొమాన్స్ ఇలా అన్ని ఉంటాయి. ఇక సీజన్ 5 తెలుగు లో కూడా అలాంటివే జరుగుతూ వస్తున్నాయి. ఇక ఈ సీజన్‏లో సన్నీ, మానస్.. సిరి, షణ్ముఖ్ స్నేహితులుగా మారిపోయారు. అయితే షణ్ముఖ్, సిరి.. బిగ్‏బాస్ ఇంట్లోకి రాకముందు నుంచి కూడా మంచి స్నేహితులు. వీరిద్దరు కలిసి పలు షార్ట్ ఫిలింస్ చేసారు. అందుకే హౌస్ వీరిద్దరూ చాల క్లోజ్ గా ఉంటారు. ఒకరి ఫై ఒకరు ప్రేమను పంచుకుంటూ , గేమ్స్ ఆడుతూ ఎవరైనా ఓ మాట అంటే ఇద్దరు ఒకరికి సపోర్ట్ గా ఉంటూ వస్తున్నారు.

తాజాగా బిగ్‏బాస్ నుంచి సిరి, షణ్ముఖ్‏లకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. అందులో వీరిద్దరు గొడవ పడుతూ కనిపించారు. షణ్ముఖ్ ఒంటరిగా కూర్చుని బాధపడుతుండగా.. సిరి అతడికి నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. దీంతో షన్నూ.. నేను ఏడ్వడం వలన నువ్వేం తక్కువ కావు. నేనే తక్కువవుతాను. నువ్వు పైకి వెళ్తవు.. నా దగ్గరకు రాకు..దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ చెప్పుకొచ్చాడు. సిరి ఎంతగా ఒదార్చేందుకు ప్రయత్నించినా.. షణ్ముఖ్ దూరం పెట్టడానికి యత్నించాడు. ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తోందని.. నువ్వు నాకొద్దంటూ ముఖం మీదే చెప్పాడు. దీంతో సిరి ఏడ్చుకుంటూ వాష్‏రూంలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. దీంతో వెంటనే షణ్ముఖ్ డోర్ తీయమని బ్రతిమిలాడిన గడియ తీయలేదు. ఇక కంగారు పడ్డ కంటెస్టెంట్స్ పరుగెత్తుకుంటూ వెళ్లి సిరిని డోర్ తీయమని బతిమాలడంతో చివరలో డోర్ తీసినట్లుగా తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య అంతగా గొడవ ఏం జరిగింది ? అనేది ఈరోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది.