బిగ్ బాస్ 5 : షన్ను ఏంట్రా నీ లొల్లి ..

బిగ్ బాస్ 5 : షన్ను ఏంట్రా నీ లొల్లి ..

షార్ట్ ఫిలిమ్స్ తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న షణ్ముఖ్..ప్రస్తుతం బిగ్ బాస్ 5 లో ఓ సభ్యుడి గా కొనసాగుతున్నాడు. మొదటి నుండి కూడా షన్ను పెద్దగా ఎవరితో కలవకుండా కేవలం సిరి , జాస్వంత్ లతో మాత్రమే క్లోజ్ గా ఉంటూ వస్తున్నాడు. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం మొదలైన బంగారు కోడిపెట్ట గేమ్ ఎంతో ఆసక్తికరంగా కొనసాగింది. జెస్సి కి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చినప్పటికీ దానిని ఉపయోగించుకోలేకపోయాడు. సిరి నమ్ముకొని అతను వేసిన ప్లాన్ మొత్తం రివర్స్ అవ్వడంతో అతను చాలా తొందరగానే ఫెయిల్ అయ్యాడు. ఈ టాస్క్ లో షన్ను ను బకరా చేయడం తో జెస్సి , సిరి లపై షన్ను కోపం తో ఊగిపోయాడు.

ముఖ్యంగా ఈ టాస్క్‌లో జెస్సీకి సిరి సాయం చేయడాన్ని షణ్ముఖ్ జీర్ణించుకోలేకపోయాడు. ఫ్రెండ్ అనుకుని నన్ను ఎదవను చేశారు.. నేను దేనికి పనికి రాను.. ఆట ఆడటం రాదు అని నన్ను సెలెక్ట్ చేసుకున్నారు.. ఇంట్లో అందరూ అలానే చూస్తున్నారు. బయటకు వెళ్లాక కూడా అందరూ అదే అంటారు అని షణ్ణ్నూ తెల ఫీలయ్యాడు. అందరూ టాస్క్‌ సరిగ్గా ఆడడని అంటున్నారని, తనను అందరూ పిచ్చ లైట్‌ తీసుకుంటున్నారని జెస్సీ, సిరిల ముందు షణ్ముఖ్‌ వాపోయాడు.‘జెస్సీ కెప్టెన్ అవ్వాలనుకున్నాడు. నువ్వు సాయం చేశావు. చివరికి నేను మోసపోయాను. నాకు గేమ్ ఆడడం కూడా రాదు.. అదే నా దరిద్రం’ అంటూ షణ్ముఖ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. జెస్సీ, సిరి ఇద్దరు సంజాయిషీ ఇచ్చే ప్రయత్నం చేసినా షణ్ముఖ్‌ ఆగకుండా సిరిని అక్కడి నుంచి వెళ్లిపో అంటూ అరిచాడు.

ఆ తర్వాత షన్ను అన్నం తినకుండా, కాఫీ తాగకుండా ఉండడం తో సిరి షన్ను దగ్గరికి వచ్చి బ్రతిమాలాడడం , షన్ను వెళ్ళిపోమన్నడం చేస్తూ వచ్చాడు. అయితే షన్ను ప్రవర్తన పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న వాటికీ కూడా షన్ను తెగ ఫీల్ అవుతున్నాడని , హౌస్ లో షన్ను ఏంచేస్తున్నాడో తెలియడం లేదని , ఓ ఆట ఆడడం లేదు , ఎంటర్టైన్మెంట్ చేయడం లేదు, కనీసం మిగతా హౌస్ సభ్యులతో క్లోజ్ గా ఉంటున్నాడా అంటే అది లేదని అంటున్నారు. మరికొంతమంది అయితే బిగ్ బాస్ వల్ల షన్ను నిజ స్వరూపం బయటకు వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద షన్ను ప్రవర్తన హౌస్ సభ్యులకే కాదు చూసే ప్రేక్షకులకు సైతం నచ్చడం లేదు .