షణ్ముఖ్‌- దీప్తి సునయన విడిపోతున్నారా..?

షణ్ముఖ్‌- దీప్తి సునయన అంటే తెలియని నెటిజన్లు లేరు. షార్ట్ మూవీస్ , టిక్ టాక్ వీడియోలతో యూత్ ను ఆకట్టుకున్న ఈ జంట..గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతారని అభిమానులు అనుకుంటున్న సమయంలో బిగ్ బాస్ వీరిద్దరి మధ్య చిచ్చు పెట్టాడు. యూట్యూబర్ గా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న షణ్ముఖ్ ..బిగ్ బాస్ సీజన్ 5 లో ఛాన్స్ వచ్చింది. ఇతడు సీజన్ 5 లో ఉన్నాడనే వార్త బయటకు వచ్చినప్పటి నుండి ఇతడే సీజన్ విన్నర్ అని అంత భావించారు. కానీ హౌస్ లోపలి వెళ్ళకగాని మనోడిలోని అసలైన వ్యక్తి బయటకొచ్చాడు.

హౌస్ సభ్యురాలు సిరి తో ఫ్రెండ్ షిప్ పేరుతో దగ్గరయ్యారు. బయటకు ఫ్రెండ్ షిప్ అని చెప్పి ఇద్దరు ఒకరికి ఒకరు బాగా దగ్గరయ్యారు. హగ్గులతో నిత్యం సిరి కౌగిలిలో బందీ అయ్యాడు. సిరి సైతం అంతకు ముందు శ్రీహన్ తో ప్రేమాయణం సాగించింది. ఇలా ఇద్దరు హౌస్ లోకి వెళ్లకముందే మరొకరితో ప్రేమలో పడ్డారు. కానీ వారిద్దరిని మరచిపోయి ఇద్దరు దగ్గరయ్యారు. అయితే బయటకు వచ్చిన షణ్ను మాత్రం తమది ఫ్రెండ్‌షిప్‌ అని క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. కానీ వీరిద్దరూ ఫ్రెండ్స్ ల లేరనే సంగతి బిగ్ బాస్ చూసినవారందరికి తెలుసు.

ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌ షోలో షణ్ను ప్రవర్తనతో అతడి ప్రేయసి, మాజీ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ దీప్తి సునయన హర్ట్‌ అయినట్లు తెలుస్తోంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతున్న పోస్టులు చూస్తే షన్ను తో బ్రేకప్ చెప్పేయబోతుందని అర్ధమవుతుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ‘కనీసం నీ మనస్సాక్షితోనైనా నిజాయితీగా ఉండు’ అని రాసుకొచ్చింది. ‘నా చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా మారాయని తెలిసినప్పటికీ నా జీవితాన్ని నేను ఎంజాయ్‌ చేస్తున్నా’, ‘ఈ సంవత్సరం నాకేమీ బాగనిపించలేదు. కానీ చాలా నేర్చుకున్నాను..’ అంటూ వరుస పోస్టులు పెట్టింది. ఇది చూసిన నెటిజన్లు షణ్ను-దీప్తిలు విడిపోవడం ఖాయం అంటున్నారు.