ద్వారకా పీఠాధిపతి శంకరాచార్య స్వామి స్వరూపాంద సరస్వతి మృతి

ద్వారకా పీఠాధిపతి శంకరాచార్య స్వామి స్వరూపాంద సరస్వతి (99) కన్నుమూశారు. మధ్యప్రదేశ్​ నార్సింగ్​పుర్​లోని పీఠంలో ఆయన తుదిశ్వాస విడిచారు. స్వామి స్వరూపానంద సరస్వతి 1924 సెప్టెంబర్ 2న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ సమీపంలోని దిఘోరీ గ్రామంలో జన్మించారు.

స్వరూపానంద సరస్వతి దేశంలోని అత్యున్నత ఆధ్యాత్మిక పీఠాధిపతిగా ఉన్నారు. 1300 సంవత్సరాల క్రితం ఆది శంకరాచార్యుల వారు ఏర్పాటుచేసిన నాలుగు శక్తి పీఠాల్లో ద్వారకా, జ్యోతిర్మఠ్ శక్తి పీఠాలకు స్వామి స్వరూపానంద అధిపతిగా కొనసాగుతున్నారు. స్వామి స్వరూపానంద మధ్యప్రదేశ్ లోని సియోనీ జిల్లా దిఘోరీ గ్రామంలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.

19 ఏళ్లకే స్వాతంత్య్ర పోరాటంలో దూకిన విప్లవ సాధువుగా పేరు తెచ్చుకున్నారు. ఈ సమయంలో ఆయన తొమ్మిది నెలలు వారణాసి, ఆరు నెలలు మధ్యప్రదేశ్​లోని ఓ జైలులో గడిపారు. 1950లో దండి సన్యాస దీక్ష చేపట్టిన ఆయన స్వామి స్వరూపానంద సరస్వతిగా ప్రసిద్ధి చెందారు. హిందువులను ఏకం చేయాలనే సంకల్పంతో ఆది గురు శంకరాచార్య దేశంలో నాలుగు మత రాజధానులను చేయగా.. ద్వారక పీఠానికి అధిపతిగా బాధ్యతలు చేపట్టారు.