రైళ్లలో మసాజ్‌ సేవలకు బదులు వైద్యసేవలు ఉత్తమం

సొంత పార్టీ నుంచే విమర్శల వెల్లువ

Shankar Lalwani, sumitra mahajan
Shankar Lalwani, sumitra mahajan

న్యూఢిల్లీ: త్వరలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నుంచి బయలుదేరే 39 రైళ్లలో మసాజ్‌ సేవలను ప్రారంభిస్తామంటూ రైల్వేశాఖ చేసిన ప్రతిపాదనలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంగా సొంత పార్టీ నేతలే ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. తాజాగా లోక్‌సభ మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, ఇండోర్‌ ఎంపి శంకర్‌ లాల్వాని కూడా ఈ దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది భారతీయ సంస్కృతికి విరుద్దమని, ముందు రైళ్లలో ప్రయాణికులకు వైద్యసేవలు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. మసాజ్‌ సేవలకు బదులు వైద్యులను అందుబాటులో ఉంచడం ఉత్తమమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌కు సుమిత్రా మహాజన్‌ ఇటీవల లేఖ రాశారు. రైళ్లలో ఇలాంటి సేవలు అందించడం సరైందేనా..అది కూడా మహిళల ముందు అవసరమా అని ఆమె ప్రశ్నించినట్లు తెలుస్తుంది.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/