చర్లపల్లి జైలుకు వైద్యురాలి హంతకులు తరలింపు

Priyanka Reddy
Priyanka Reddy

హైదరాబాద్‌: శంషాబాద్‌లో పశువైద్యరాలి హత్యకేసులో నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు. గట్టి బందోబస్తు మధ్య నిందితులను పోలీస్ వాహనాల్లో తరలించారు. మరోవైపు ఆందోళనకారులు వాహనాలకు అడ్డుగా వచ్చి నిరసన తెలిపారు. పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో వాహనాలపై రాళ్లు విసిరారు. దీంతో షాద్‌నగర్ పరిసరాలన్నీ టెన్షన్.. టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇంకోవైపు నిందితులను శిక్షించకుండా.. ప్రజలపై లాఠీఛార్జ్ చేయడమేంటని ఆందోళనకారులు ప్రశ్నిస్తున్నారు. నిందితులకు మెజిస్ట్రేట్ 14రోజులు రిమాండ్ విధించారు. మెజిస్ట్రేటే షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు నిందితులను విచారించారు. రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/