శాకుంతలం నుండి మరో సాంగ్ రాబోతుంది

శాకుంతలం నుండి ఇప్పటికే ఫస్ట్ సాంగ్ మల్లికా మల్లికా అంటూ సాగే మెలోడీ సాంగ్ విడుదలై ఆకట్టుకోగా..ఇప్పుడు రెండో సాంగ్ విడుదలకు సిద్ధమైంది. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న శాకుంతలం మూవీ ని బిగ్ అప్డేట్ వచ్చింది. దర్శకుడు గుణశేఖర్..నిర్మాత దిల్ రాజు కలిసి రూపొందించిన పౌరాణిక చిత్రం శాకుంతలం.

ఈ సినిమాలో సమంత కీ రోల్ చేస్తుండగా..మలయాళ యంగ్ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటిస్తున్నాడు. ఫిబ్రవరి 17 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతూనే..సినిమా ప్రమోషన్ ను వేగం చేస్తున్నారు. ఇక ప్రమోషన్లో భాగంగా ఈ నెల 25 న సినిమాలోని రెండో సింగిల్ ను రిలీజ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసారు.

ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా విశేష స్పందన లభించింది. మహా భారతంలో దుశ్యంతుడు, శకుంతల ప్రేమ కథకి ప్రత్యేక స్థానం ఉంది. వీరిద్దరి ప్రేమ కథనే దర్శకుడు గుణశేఖర్ అపురూప దృశ్యకావ్యంగా చూపించబోతున్నారు. సమంత లాంటి నటి శకుంతలగా నటిస్తుండడంతో ఆ పాత్ర ఎంతలా హైలైట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో సమంత నటన, లుక్స్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. మరి రెండో సాంగ్ ఎలా ఉండబోతుందో చూడాలి.