సమంత ‘శాకుంతలం’ టాక్ ..

బాల రామాయణం , చూడాలని వుంది, ఒక్కడు , రుద్రమదేవి వంటి సూపర్ హిట్ చిత్రాలను డైరెక్షన్ చేసిన గుణ శేఖ‌ర్..పౌరాణిక ప్రేమ గాథ. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా శాకుంతలం మూవీ తెరకెక్కించారు. దుష్యంతుడిగా మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్‌, శ‌కుంత‌ల‌గా స‌మంత న‌టించారు. గుణ శేఖర్ మేకింగ్, టేకింగ్‌కి స‌మంత క్రేజ్‌తో పాటు ఈ సినిమా నిర్మాణంలో దిల్ రాజు కూడా పార్ట్ అయ్యారు. దీంతో సినిమాపై హైప్ పెరిగింది. దానికి తోడు టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లోని విజువ‌ల్స్ ఈ ఆస‌క్తిని మ‌రింత‌గా పెంచేశాయి. భారీ అంచనాల మధ్య ఈరోజు (ఏప్రిల్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక ఈ మూవీ చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. శాకుంతలం కథ అద్బుతమైన అమర ప్రేమకావ్యం. కానీ ఎమోషన్స్ లేకుండా చాలా ఫ్లాట్‌గా సాగుతుంది. నేటి తరానికి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన అజరామరమైన ప్రేమకథను చెప్పే ప్రయత్నాన్ని గుణశేఖర్ మెచ్చు కోవాల్సిందే. అయితే గొప్ప ఫీలింగ్ అందించడంలో విఫలమయ్యారనే చెప్పాలి. గ్రాఫిక్ వర్క్ సరిగా లేని కారణంగా సినిమాకు కనెక్ట్ కావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుుంది. సమంత ఫెర్ఫార్మెన్స్, గ్రాండియర్‌గా తెర మీద కనిపించే విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు పాజిటివ్‌గా నిలిచాయి. కథ పరంగా, సాంకేతిక అంశాల పరంగా ఉన్న చాలా లోపాలను పక్కన పెడితే.. ముఖ్యంగా నేటితరం, చిన్న పిల్లలకు చూపించాల్సిన సినిమా. ఓసారి చూడదగిన సినిమా అని అంటున్నారు.