వృద్ధి రేటును పెంచే విధంగా సంస్కరణలు

దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడాని రాష్ట్రాలు కీలకపాత్ర పోషించాలి

Shaktikanta Das
Shaktikanta Das

ముంబయి: వారం రోజుల్లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..వినియోగ డిమాండ్‌, వృద్ధి రేటును పెంచే విధంగా సంస్కరణలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. వృద్ధి తదితర లక్ష్యాలను సాధించడానికి ద్రవ్య పాలసీకి పరిమితులు ఉన్నాయని అన్నారు. ఏ రంగంలో సంస్కరణలు చేపట్టాల్లో విశ్లేషిస్తున్నామని..అన్ని రంగాలు అభివృద్ధి చెందే విధంగా బడ్జెట్‌ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ కీలక పాత్ర పోషించాలంటే ఆహార ప్రాసెసింగ్‌ పరిశ్రమలు, పర్యాటక రంగం, ఇ-కామర్స్‌, స్టార్టప్‌లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మౌళిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/