నేరాన్ని అంగీకరించిన షకిబ్‌

వాట్సాప్‌ సందేశాలు బహిర్గతం

shakib al hasan
shakib al hasan

ఢాకా: క్రీడాకారులు, బుకీల మధ్య కొన్నిసార్లు సంభాషణలు జరుగుతుంటాయి. అవే క్రీడాకారుల కెరీర్‌ను పాడుచేస్తాయి. ఇదే విషయం బంగ్లా క్రీడాకారుడైన షకిబ్‌ అల్‌ హసన్‌కు జరిగింది. ఓ బుకీ తనను సంప్రదించిన విషయాన్ని బంగ్లా క్రికెట్‌ క్రీడాకారుడు షకిబ్‌ అల్‌ హసన్‌ ఐసిసి అవినీతి నిరోధక శాఖకు తెలపకపోవడంతో అతడిపై రెండేళ్ల నిషేధం విధించిన విషయం తెలిసిందే. భారత బుకీ దీపక్‌ అగర్వాల్‌ ఓ వ్యక్తి ద్వారా షకిబ్‌ ఫోనన్‌ నంబర్‌ తీసుకొని పలుసార్లు వాట్సాప్‌లో మెసేజ్‌లు చేశాడు. ఈ సందర్భంగా వారిమధ్య బిట్‌కాయిన్స్‌, డాలర్‌ అకౌంట్స్‌ సమాచారంపై సంభాషణలు జరిగాయి. అయితే, షకిబ్‌ మాత్రం దీపక్‌ను వ్యక్తిగతంగా కలిసేందుకు ఆసక్తి చూపించాడు. అప్పుడు జరిగిన సంభాషణ మొత్తం డిలీట్‌ అయిందని, అందులో జట్టు అంతర్గత సమాచారం ఇవ్వాలని దీపక్‌ కోరినట్లు షకిబ్‌ విచారణ అధికారుల వద్ద అంగీకరించాడు. అంతేకాక ఐసిసి విచారణ అధికారుల వద్ద తన నేరాన్ని అంగీకరించాడు.
తాజా తెలంగాణ కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/telangana/