షాహిద్ క‌పూర్ మైన‌పు విగ్ర‌హం

Shahid Kapoor wax statue
Shahid Kapoor wax statue

సింగపూర్‌: ప్రముఖ బాలీవుడ్‌ స్టార్‌ హీరో షాహిద్‌ కపూర్‌ ప్రతిష్ఠాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌ సంస్థలో తన విగ్రహాన్ని తానే ఆవిష్కరించుకున్నాడు. మైన‌పు విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో షాహిద్‌తో పాటు ఆయ‌న భార్య మీరా రాజ్‌పుత్‌, పిల్ల‌లు మిషా, జైన్ క‌పూర్ హాజ‌ర‌య్యారు. బ్లాక్ అండ్ వైట్ సూట్‌లో షాహిద్ లుక్ అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుంది. త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యాక్స్ స్టాచ్యూతో క‌లిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. క‌వ‌ల‌లు అనే కామెంట్ పెట్టాడు. దీంతో షాహిద్ క‌పూర్ అరుదైన ఘ‌న‌త‌ని పొందాడు .