రాఫెల్‌ తీర్పుతో వారికి దిమ్మతిరిగింది

Amit Shah
Amit Shah

ఢిల్లీ: రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై సుప్రీంకోర్టు నేడు తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. కాగా ఈ సందర్భంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. రాఫెల్‌పై అసత్య ప్రచారాలు చేసిన నేతలకు, పార్టీలకు ఇది దిమ్మతిరిగిపోయే జవాబని ఆయన అన్నారు. జాతి ప్రయోజనాలను పక్కన పెట్టి రాఫెల్‌ ఒప్పందంపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌ పార్టీ, ఆపార్టీ నేతలు దేశానికి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. అవినీతి రహిత పాలనకు, పారదర్శకతకు మోది ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సుప్రీం తీర్పుతో మరోసారి రుజువైందని చెప్పారు. ఈ అంశంపై అనవసరంగా పార్లమెంట్‌ సమయాన్ని వృథా చేశారని, ఇకనుండి ప్రజా ప్రయోజనాల కోసమే ఉపయోగించాల్సిన టైం వచ్చిందని అమిత్‌ షా ట్వీట్‌ చేశారు.
తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/