టీ20 ర్యాంకింగ్స్‌ టాప్‌ ప్లేస్‌లో షెఫాలీ వర్మ

మిథాలీ రాజ్‌ తర్వాత రెండో భారత మహిళా క్రికెటర్‌

Shafali Verma
Shafali Verma

దుబాయ్: భారత మహిళా యువ సంచలనం షెఫాలీ వర్మ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌ లేపింది. మహిళల టీ20 ర్యాంకింగ్స్‌ బ్యాటింగ్‌ విభాగంలో 16 ఏళ్ల హర్యానా సంచలనం షెఫాలీ అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది. గత రెండేళ్లుగా నెంబర్‌ వన్‌ స్థానంలో కొనసాగుతున్న న్యూజిలాండ్‌ స్టార్ సుజీ బేట్స్‌ను వెనక్కి నెట్టి టాప్‌ దక్కించుకుంది. ఈ ర్యాంకును కేవలం 18 మ్యాచులు మాత్రమే ఆడి దక్కించుకోవడం విశేషం. 16 ఏళ్ల బ్యాటింగ్ సంచలనం షెఫాలీ వర్మ 19 స్థానాలను మెరుగుపరచుకొని నెంబర్ వన్ ర్యాంకును చేరుకుంది. ప్రస్తుతం జరుగుతున్న మహిళా టీ20 ప్రపంచకప్‌లో అద్భుతమైన బ్యాటింగ్ ఫర్ఫామెన్స్‌తో షెఫాలీ మొదటి ర్యాంకుకు చేరుకుంది. భారత మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ తర్వాత టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌కు చేరిన రెండో మహిళా క్రికెటర్‌గా నిలిచింది. గురువారం ఇంగ్లండ్‌తో జరుగునున్న సెమీస్‌ మ్యాచ్‌కు ముందే నంబర్‌ వన్‌ ర్యాంక్‌కు చేరుకోవడం విశేషం.

తాజా ఇంగ్లీష్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/english-news/