విశాఖలో ఎనిమిదేళ్ల బాలికపై లైంగికదాడి

sexual harassment on eight years old girl
sexual harassment on eight years old girl

విశాఖ: ఓ కామాంధుడు ఎనిమిదేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలో గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనకాపల్లి గ్రామీణ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై రామకృష్ణారావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో 30 ఏళ్ల రాజాన సింహాచలం అనే వ్యక్తి ఇంటినుంచి దూరంగా తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. తనకు జరిగిన ఘోరాన్ని చెప్పుకోలేని ఆ బాలిక పరిస్థితిని ఇంటి పక్కనే ఉన్న మరో మహిళ గుర్తించింది. ఈ విషయాన్ని ఆమె బాలిక తల్లికి చెప్పింది. ఈ మేరకు బాలిక తల్లి ఫిర్యాదు చేశారని ఎస్సై తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని బాలికను వైద్యపరీక్షలకు తరలించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/