ఏలూరులో వ్యభిచారం గుట్టురట్టు

Prostitution
Prostitution

ఏలూరు: గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా ఒకటి పశ్చిమగోదావరి జిల్లాలో పోలీసులకు చిక్కింది. ఏలూరులోని వంగాయ గూడెం సమీపంలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుతుందని వన్‌ టౌన్‌ సిఐ బాలరాజాజీకి సమాచారం అందడంతో ఎస్‌ఐ మరియు సిబ్బందితో కలిసి దాడికి దిగారు. ఏలూరు సమీపంలోని గొల్లాయి గూడెం గృహకల్ప హౌసింగ్‌ కాలనీలో పుట్టా నీలవేణి అనే మహిళ కొంతకాలంగా గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తుంది. కాగా తన వ్యాపారం కోసం ఓ 25 ఏళ్ల యువతిని తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తుంది. సమాచారం అందిన పోలీసులు దాడికి దిగగా అక్కడ విటులుగా ఉన్న ఏలూరు శాంతినగర్‌కు చెందిన యువకుడు, తాడేపల్లిగూడెంలోని బొమ్మిడికి చెందిన మరొక యువకుడు, ఏలూరు దొంగలమండపం ప్రాంతానికి చెందిన ఓ ఆయుర్వేద వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిర్వాహకురాలైన నీలవేణిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అక్కడ ఉన్న యువతిని పోలీసులు సంరక్షణ హోంకు తరలించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/