ఓ వైపు కార్చిచ్చు.. మరోవైపు భారీ వర్షం

ఆస్ట్రేలియాలో పరిస్థితులు అస్థవ్యస్తం

Australia bushfire
Australia bushfire

సిడ్నీ: కార్చిచ్చుతో అతలాకుతలం అవుతున్న ఆస్ట్రేలియాకు వర్షం పడి ఊరట లభించిందను కుంటే… ఇప్పుడు మరోముప్పు ముంచుకొచ్చింది. ఇటీవల కొన్ని కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో భారీవర్షాలు సంభవించడంతో జలమయ్యాయి. క్వీన్స్‌లాండ్‌ రాష్ట్రంలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తున్నది. వర్షాల ధాటికి ఇప్పటికే చాలా ప్రాంతాలు నీటమునిగాయి. గత దశాబ్ద కాలంలో ఇంత ఎక్కువుగా వర్షం పడటం ఇదే తొలిసారి. ఎన్నడూ లేనంతగా వర్షం పడటం వల్ల భారీ వరదలు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కానీ కార్చిచ్చు ఉద్ధృతంగా ఉన్న దక్షిణ, ఆగేయ ఆస్ట్రేలియాలో ఎలాంటి వర్షమూ లేదు. విక్టోరియా, న్యూ సౌత్‌ వేల్స్‌లో అగ్ని జ్వాలలు ఇంకా ఎగిసిపడుతూనే ఉన్నాయి. దాదాపు 75 చోట్ల భారీ ఎత్తున దావాగ్ని రగులుతూనే ఉందని అధికారులు తెలిపారు. కార్చిచ్చు ధాటికి ఇప్పటివరకు 2 వేలకుపైగా ఇండ్ల్లు, 10 మిలియన్ల ఎకరాల అడవి కాలి బూడిదయ్యాయి. 27 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది వన్యప్రాణులు అగ్నికి ఆహుతయ్యాయి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/