మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ప్రముఖుల నివాళులు

న్యూఢిల్లీః కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి నేడు సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాళులర్పించారు. భారత్ జోడో యాత్రలో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఇందిరాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించి, పుష్పాంజలి ఘటించారు. కాగా, ప్రధాని నరేంద్రమోడీ కూడా నివాళులర్పించారు. ఢిల్లీలోని శక్తిస్థల్ లోని ఇందిరాగాంధీ సమాధి వద్ధ శ్రద్ధాంజలి ఘటించారు.
కాగా, భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు, కమలా నెహ్రూ దంపతులకు 1917, నవంబర్ 19న ఇందిరాగాంధీ జన్మించారు. 1960లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. 1964 నుంచి 1966 వరకు సమాచార, ప్రసారశాఖ మంత్రిగా పని చేశారు. తండ్రి మరణం తర్వాత 1966 జనవరి నుంచి 1977 మార్చి వరకు భారత ప్రధానిగా కొనసాగారు. ఇందిరాగాంధీ దేశానికి మొదటి మహిళా ప్రధాని కావడం విశేషం. 1984 అక్టోబర్ 31న ఇందిరాగాంధీ బాడీ గార్డులే ఆమెను కాల్చి చంపారు.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/movies/