శాసనసభలో అడుగుపెట్టనున్న 70 మంది కొత్త ఎమ్మెల్యెలు

ap
ap

అమరావతి: ఏపి శాసనసభ ఎన్నికల్లో గెలిచిన 175 మందిలో 67 మంది వైఎస్‌ఆర్‌సిపి కాగా, టిడిపి శాసనసభ్యులు ముగ్గురున్నారు. వీరంతాకూడా మొదటిసారి శాసనసభలోకి అడుగు పెడుతున్నారు. వైఎస్‌ఆర్‌సిపి నుండి ఎన్నికై తొలిసారి శాసనసభలో అడుగు పెడుతున్న వారిలో శిల్పా చక్రపాణిరెడ్డి (శ్రీశైలం), వి.వరప్రసాద్‌ (గూడూరు), అనంత వెంకట్రామిరెడ్డి (అనంతపురం) చట్టసభలకు పాతవారే. వారిలో శిల్పా చక్రపాణిరెడ్డి గతంలో శాసనమండలి సభ్యుడిగా పనిచేయగా, వి.వరప్రసాద్‌, అనంత వెంకట్రామిరెడ్డి ఎంపీలుగా బాధ్యతలు నిర్వహించారు. శాసనసభకు మాత్రం తొలిసారి ఎన్నికయ్యారు. ఇకపోతే టిడిపి నుండిన్నికైన 23 మందిలో మద్దాళి గిరిధర్‌ (గుంటూరు పశ్చిమ), ఆదిరెడ్డి భవాని (రాజమహేంద్రవరం నగర), రామరాజు (ఉండి) తొలిసారి శాసనసభలో అడుగు పెడుతున్నారు.


తాజా సినీమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/