దుబ్బాక..ఏడో రౌండ్‌ టిఆర్‌ఎస్‌ ఆధిక్యం

trs
trs

సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతుంది. ఇప్పటి వరకూ ఏడు రౌండ్లు పూర్తయ్యాయి. మొదటి ఐదు రౌండ్లలో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యంలో కొనసాగగా.. ఆరవ రౌండ్‌లో మాత్రం టిఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత 355 ఓట్ల ఆధిక్యంలో కొనసాగారు. అయితే అదే ఆధిక్యాన్ని ఏడో రౌండ్‌లో కూడా టిఆర్ఎస్ కొనసాగించింది. ఈ రౌండ్‌లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి 182 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం 2,485 ఓట్ల ఆధిక్యంలో బిజెపి అభ్యర్థి కొనసాగుతున్నారు. దుబ్బాకలో ఇప్పటి వరకు 52,055 ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి అయ్యింది. ఏడో రౌండ్‌లో బిజెపి అభ్యర్థి రఘునందన్‌ .. 22,762 ఓట్లు, టిఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత .. 20,277 ఓట్లు,కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి ..4,003 ఓట్లు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/