కాపు రిజర్వేషన్లపై త్రిసభ్య కమిటి ఏర్పాటు

సిఎం జగన్‌ కీలక నిర్ణయం

cm jagan
cm jagan

అమరావతి : కాపు రిజర్వేషన్ల అంశంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాపు రిజర్వేషన్లు, కేంద్ర చట్టం, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసేందుకు త్రి సభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా మంత్రి కన్నబాబు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఉన్నారు. కాపు రిజర్వేషన్ల అంశంపై సోమవారం వైఎస్‌ఆర్‌సిపి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైఎస్‌ఆర్‌సిపి ఎల్పీ కార్యాలయంలో భేటీ అయ్యారు. అనంతరం వీరితో సిఎం జగన్‌ సమావేశమయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నాలుగో తేదీన కాపు రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చెప్పాలంటూ.. కేంద్రం రాసిన లేఖ అంశాన్ని జగన్‌ ప్రస్తావించారు. కాపులను బీసీల్లో చేర్చాలనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటారా.. అంటూ లేఖలో కేంద్రం స్పష్టత కోరిందని నేతలు గుర్తు చేశారు. ఆ లేఖకు అప్పటి సిఎం చంద్రబాబు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని చెప్పారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/