మేలు చేసే నువ్వుల నూనె

మేలు చేసే నువ్వుల నూనె
Sesame oil for Healthy Hair

నువ్వుల నూనెను వంట్లోనే కాదు కేశ సంరక్షణలోను వాడవచ్చు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు, మినరల్స్‌ ఎక్కువ మోతాదులో ఉంటాయి. నువ్వుల నూనె వెంట్రుకలకు సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.
జుట్టు రాలడాన్ని నువ్వుల నూనె నివారిస్తుంది. ఇందులో ఒమేగా – 3, ఒబేగా – 6, ఒమేగా – 9 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు, వెంట్రుకల కుదుళ్లకు కావాల్సిన పోషణనిస్తాయి. కుదుళ్లను బలంగా చేస్తాయి. నువ్వుల నూనెలో యాంటీ ఫంగల్‌, వాపు తగ్గించే గుణాలు ఉంటాయి. నువ్వుల నూనె రాసుకుంటే మాడు మీది కురుపులు పోయి, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
ఈ నూనె జుట్టుకు మంచి హెయిర్‌ కండిషన్‌గా కూడా పనిచేస్తుంది. వెంట్రుకలు చిట్లిపోవడాన్ని నిరోధించి, జీవం కోల్పోయిన వెంట్రుకలను ఆరోగ్యంగా చేస్తుంది.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/health1/