మరో కీలక నిర్ణయం తీసుకోనున్న ట్రంప్‌

‘ జన్మతః పౌరసత్వం’ రద్దు చేసే విషయాన్ని తీవ్రంగా ఆలోచిస్తున్నాం

Donald Trump
Donald Trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ‘అమెరికా ఉద్యోగాలు అమెరికన్‌లకే’ నినాదంతో వలసదారుల పట్ల కఠిన నిర్ణయాలను అమలు చేసిన ట్రంప్‌
సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా కదులుతోంది. జన్మతః పౌరసత్వం (బర్త్‌రైట్‌ సిటిజన్‌ షిప్‌) రద్దు చేసే విషయం గురించి తాము తీవ్రంగా ఆలోచిస్తున్నామని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నిల సందర్భంగా తన ప్రచారాస్త్రాల్లో దీన్ని కూడా వాడుకున్నారు ట్రంప్‌. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోకున్నట్లు గతేడాది ప్రకటించడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. కాగా, తాజాగా ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ, ఖఖఅవును! ఖజన్మతః పౌరసత్వంగ రద్దు చేసే విషయాన్ని తీవ్రంగా ఆలోచిస్తున్నాం. అది నిజంగా హాస్యాస్పదం. దేశాలు, సరిహద్దులు దాటి మా దేశంలో బిడ్డలను కంటున్నారు. దాంతో వారికి అమెరికా పౌరసత్వం వస్తోంది. ఈ విషయాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాంగ అని ట్రంప్‌ పేర్కొన్నారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/