సిరీస్‌ గెలవడం బంగ్లాకు ఉపశమనం

Mahmudullah
Mahmudullah

రాజ్‌కోట్‌: భారత్‌ పర్యటనకు ముందు బంగ్లాదేశ్‌ ప్లేయర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌పై నిషేదానికి గురైన విషయం విదితమే. ఓ బుకీ తనని సంప్రదించిన విషయాన్ని షకిబ్‌ అవినీతి నిరోధక శాఖ దృష్టికి తీసుకురానందున అతనికి రెండేళ్ల నిషేదాన్ని విధించింది. కాగా రెండో టీ20కి ముందు బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ మహ్మదుల్లా మాట్లాడుతూ.. ఎక్కడైనా భారత్‌ అత్యుత్తమ జట్టేనని, రెండో మ్యాచ్‌లో తమ జట్టు మంచి ప్రదర్శన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ మ్యాచ్‌ ఆడేందుకు ఆటగాళ్లంతా ఆసక్తిగా ఉన్నామని, మంచి ప్రదర్శన చేస్తామనే నమ్మకం ఉందన్నారు. ఈ గెలవడం తమ జట్టుకు ఉపశమనంలాంటిదని మహ్మదుల్లా వ్యాఖ్యానించారు.
తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/