సిరీస్‌ దక్షిణాఫ్రికా కైవసం

రెండో టెస్టులో శ్రీలంకపై పది వికెట్ల తేడాతో విజయం

Dean Elgar Not out – 31-

హాన్నెస్‌బర్గ్‌ : శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా పది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌ కేవలం మూడు రోజుల్లోనే ముగియడం గమనార్హం. ఈ విజయంతో దక్షిణాఫ్రికా సిరీస్‌ను 2-0తో గెలచుకుంది. మూడో రోజున శ్రీలంకను రెండో ఇన్నింగ్స్‌లో 211 పరుగులకు ఆలౌట్‌ చేసిన దక్షిణాఫ్రికా విజయానికి కావలసిన 67 పరుగులను వికెట్‌ నష్టపోకుండా 13.2 ఓవర్లలోనే సాధించి విజయాన్నందుకుంది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హీరో డీన్‌ ఎల్గర్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులను అందుకున్నాడు.

నాలుగు వికెట్లకు 150 పరుగులతో మూడో రోజు ఆటను ఆరంభించిన శ్రీలంక త్వరగానే కెప్టెన్‌ కరుణరత్నె వికెట్‌ను కోల్పోయింది. కరుణరత్నె 103 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. ఆపై తిరిమన్నె(31), వికెట్‌కీపర్‌ డిక్‌వెల్లా(36) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయకపోవడంతో లంక ఇన్నింగ్స్‌ 211 పరుగులకే ముగిసింది. లుంగి ఎంగిడి 4, సిప్లమా 3, అన్రిచ్‌ నార్జ్‌ 2 వికెట్లు దక్కించుకున్నారు. ఆపై విజయానికి కావలసిన పరుగులను మార్క్‌రమ్‌(36నాటౌట్‌), ఎల్గర్‌(31నాటౌట్‌) వికెట్‌ పోకుండా సాధించడంతో దక్షిణాఫ్రికా గెలుపొందింది.

స్కోర్‌బోర్డ్‌ :

శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌ – 157; దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌- 302; శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌ – దిముత్‌ కరుణరత్నె సి మల్డర్‌ బి నార్జ్‌ 103, కుశాల్‌ పెరీరా బి ఎంగిడి 1, తిరిమన్నె సి డికాక్‌ బి ఎంగిడి 31, కుశాల్‌ మెండిస్‌ సి డికాక్‌ బి ఎంగిడి 0, భనుక సి మహరాజ్‌ బి నార్జ్‌ 1, డిక్‌వెల్లా సి బవ్ఞమ బి ఎంగిడి 36, షనక సి సిపామ్ల బి మల్డర్‌ 8, హసరంగ బి సిపామ్ల 16, చమీర సి డికాక్‌ బి సిపామ్ల 0, విశ్వ ఫెర్నాండొ నాటౌట్‌ 1, అసిత ఫెర్నాండొ బి సిపామ్ల 0, ఎక్స్‌ట్రాలు 14, మొత్తం(56.5 ఓవర్లలో ఆలౌట్‌)211.
వికెట్ల పతనం : 1-1, 2-86, 3-92, 4-109, 5-176, 6-181, 7-190, 8-209, 9-120, 10-211.
బౌలింగ్‌ : లుంగి ఎంగిడి 15-5-44-4; అన్రిచ్‌ నార్జ్‌ 19-2-64-2; మల్డర్‌ 13-3-52-1; సిపామ్ల 9.5-1-40-3.

దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ –

ఐడెన్‌ మార్క్‌రమ్‌ నాటౌట్‌ 36, డీన్‌ ఎల్గర్‌ నాటౌట్‌ 31, ఎక్స్‌ట్రాలు 0, మొత్తం(13.2 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా)67.
బౌలింగ్‌ : విశ్వ ఫెర్నాండొ 4-0-23-0; అసిత ఫెర్నాండొ 4-1-20-0; వనిందు హసరంగ 2.2-0-16-0; దసున్‌ షనక 3-1-8-0.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/