లాభాల్లో దేశీయ మార్కెట్లు

ముంబయి: నేడు దేశీయ మార్కెట్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. ఉదయం 10.00 గంటలకు బాంబే స్టాక్ మార్కెట్ సూచీ సెన్సెక్స్ 90 పాయింట్లు లాభపడి 41,442 వద్ద, నిఫ్టీ 24 పాయింట్లు వృద్ది చెంది 12,189 వద్ద ట్రేడవుతున్నాయి. అంతేకాకుండా ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 41,480 పాయింట్లను తాకడం గమనార్హం. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.90 గా ఉంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/