కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

Sensex
Sensex

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తోందనే భయంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో, బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీలు ఆరు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 587 పాయింట్లు పతనమై 36,472కి పడిపోయింది. నిఫ్టీ 177 పాయింట్లు కోల్పోయి 10,741కి దిగజారింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/